
అచ్చ తెలుగు బొమ్మకి, అక్షరాలకి, సినిమాలకి చిరునామా - మన బాపు ఇన్నాళ్ళకు "పద్మశ్రీ" సంపాదించారు. ఆయన ప్రతిభ కొంచెం (అంటే చాలా) ఆలశ్యంగా అయినా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా ఆయన విజయంలో సమాన పాత్రధారి (సినిమాలకు సంబందించినంత వరకూ)
శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారిని కూడా స్మరించుకుందాం.
వీళ్ళిద్దరూ మన తెలుగు భాషకు కొత్త జవం జీవం ఇవ్వడంలో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్ని సినిమాలు, ఎన్ని మాటలు - బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం లాంటి సినిమాలతో తెలుగు భాషకి కొత్త జీవితం ప్రసాదించిన బాపు రమణ ద్వయానికి తెలుగు జాతి ఎప్పుడు ఋణపడి ఉంటుంది.
బాపు తన గీతలో తెలుగుదనానికి ఒక రూపు కల్పించారు. ఆయన బొమ్మలతో ఎన్ని పుస్తకాలు, నవలలు, కావ్యాలు తమ విలువను పెంచుకున్నాయి !!
ఆయన కార్టూన్లు..కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయన సృష్టించిన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.
కొసమెరుపు:
ఇంతకీ బాపు పేరు ను ప్రతిపాదించినది "ఆంద్ర ప్రదేశ్" జాబితా నుంచి కాదట. ఆయన పేరు (శ్రీమతి జానకి పేరు కూడా) తమిళనాడు ప్రభుత్వ జాబితా నుంచి ఎంపికయింది!!
పద్మ అవార్డుల పూర్తి జాబితా చూడండి.

ఇప్పుడు నిబిడాశ్చర్యంతో అందరూ....
ఆశ... తెగులు కోటాలో అవార్డు వచ్చేస్తుందనే. హమ్మా.
ReplyDelete"State/Domicile" తమిళనాడు అని ఉంది.
ReplyDeleteఆయన పేరుని తమిళనాడు ప్రభుత్వమే ప్రతిపాదించిందా? కనుక్కొని చెపుతారా?
నేను చదివినవాటి ప్రకారం, బాపు పేరుని "పద్మభూషణ్"కై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
http://articles.timesofindia.indiatimes.com/2012-12-04/news-interviews/35593664_1_bapu-padma-bhushan-award-d-ramanaidu
http://in.movies.yahoo.com/news/veteran-southern-producer-d-rama-naidu-gets-padma-160602395.html
నేను చదివిన సమాచారం ప్రకారం రెండు ప్రభుత్వాలూ ప్రతిపాదనలు పంపాయి... (పద్మశ్రీ కోసమే అనుకుంటున్నాను) కానీ తమిళనాడు ప్రతిపాదన మన ప్రతిపాదన కంటే బాగుందని కేంద్రం భావించిందట.
ReplyDelete