Tuesday, September 7, 2010

తెలుగు జాతి అదృష్టం ఈ పాట

దేవులపల్లి కవిత్వం + భానుమతి గాత్రం + సాలూరి స్వర రచన 
+ బి  యన్ రెడ్డి చిత్రీకరణ =
తెలుగు జాతి అదృష్టం ఈ పాట

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో(2)
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా...
అలలు కొలనులో గల గల మనినా(2)
దవ్వున వేణువు సవ్వడి వినినా(2)
నీవు వచ్చేవని నీ పిలుపే విని(2)
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా(2)
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

Sunday, August 15, 2010

ఎందుకొచ్చిన్

కొచ్చిన్ కు డిల్లీ పై పటేల్ ప్రయాణం - ఒక దినపత్రిక లో వచ్చిన వార్త తాలూకు హెడ్ లైన్ 


దీనిపై శ్రీ శ్రీ వ్యాఖ్య : 


పటేల్ కు కొచ్చిన్ పై డిల్లీ ప్రయాణం. 
డిల్లీ కి పటేల్ పై కొచ్చిన్ ప్రయాణం 
డిల్లీ కి  డిల్లీ పై డిల్లీ ప్రయాణం
కొచ్చిన్ కు కొచ్చిన్ పై కొచ్చిన్ ప్రయాణం 
అయినా ఎందుకొచ్చిన్  ప్రయాణాలు ఇవన్నీ? 
- ఆనంద వాణి, వారపత్రిక, 14-05 -1950