ఇప్పటివరకు ఇది సినిమా పాట అనుకున్నాను.
ఈ రోజే పెద్ద బాలశిక్ష తిరగేస్తుంటే, ఇదొక సంప్రదాయిక
బాలల గేయమని తెలిసింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
కోసిన పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతమ్మ కియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా
దాచుకోకుంటేను దోచుకుంటారు
ఇది పాలగుమ్మి వారి రచనని ఎక్కడో చదివిన గుర్తు
ReplyDelete